అంగన్‌వాడీల తొలగింపు ఉత్తర్వుల కాపీలు దహనం

గుంటూరు) అన్యాయంగా అంగన్ వాడీ మహిళల్నిఉద్యోగాల్లోంచి తొలగించే ప్రయత్నాల్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెమో కాపీల దగ్దం కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటురూ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ర్ట నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  లాఠీలు, తూటాలతో ఉద్యమాలను అణచలేరని వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు. అంగన్‌వాడీల పోరాటానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆయన
స్పష్టం చేశారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున
మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామంటూ మహిళల ఓట్లతో గెలిచిన చంద్రబాబు
అన్నిరకాలుగా వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్
మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ  మహిళలతో కంట నీరు
పెట్టించిన ఏ ఒక్క ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. 

Back to Top