రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ నిరసనలు

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన బాబు
పేదల ఆరోగ్యంతో ఆటలు
ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ ఆగ్రహం
ఆరోగ్యశ్రీ బాధితులతో కలిసి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ ల వద్ద ధర్నా

ఏపీ: ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండటంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జరుగుతున్నాయి. అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు నిర్వహించిన ఆందోళనల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.

గుంటూరుః జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి మోపిదేవి, మేరుగ నాగార్జున, ఎల్. అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి డాక్టర్ గోపిరెడ్డి, ముస్తఫా, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

వైయస్ఆర్ కడపః కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నంః విశాఖలో జరిగిన ఆందోళనలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని.. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత‍్వం ఆరోగ్యశ్రీని నీరుగార‍్చుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్‌, ముత్యాల నాయుడు తదితర నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆరోగ్యశ్రీ పథకం అమలును మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు.

శ్రీకాకుళంః జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, గొర్లె కిరణ్‌ కుమార్‌, తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

తూర్పోగోదావరి జిల్లాః కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో నేతలు కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ముత్తా శశిధర్‌, పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాః ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో నేతలు ఆళ్ల నాని, కారుమురి నాగేశ్వరరావు, బాలరాజు, మురళీరామకృష్ణ, కొటారు రామచంద్రారావు, నవీన్‌బాబు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్యం అందించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పేదరోగులకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత చంద్రబాబుది అని ఆళ్ల నాని, కారుమురి నాగేశ్వరరావు విమర్శించారు.

నెల్లూరుః కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర‍్నాలో నేతలు కాకాని గోవర్దన్‌ రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, సంజీవయ్య, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి పూర్తిస్థాయి నిధులు కేటాయించి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

చిత్తూరుః కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, భూమన కరుణాకర్‌ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా నేతలు ఎండగట్టారు.

కర్నూలుః కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పార్టీ నేతలు గౌరు వెంకట్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గౌరు చరిత, కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌ రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, బీవై రామయ్య, హఫీజ్‌ ఖాన్‌, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంః ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలు ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, నేతలు మజ్జి శ్రీనివాసరావు, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రకాశం జిల్లాః ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పార్టీ అధినేత వైయస్ జగన్ పాల్గొన్నారు. వైయస్ జగన్ తో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్‌బాబు, జంకె వెంకటరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు వరికూటి అశోక్‌ బాబు, ఐవీ రెడ్డి, యడం బాలాజీ, గొట్టిపాటి భరత్, గరటయ్య తదితరులు పాల్గొన్నారు. 

కృష్ణాః ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ నేతలు విజయవాడలో లెనిన్ సెంటర్ నుంచి అలంకార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, నేతలు సామినేని ఉదయభాను, జోగిరమేష్, దూల నాగేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. 

అనంతపురంః జిల్లా కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ పార్టీ నేతలు అనంతవెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి, పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Back to Top