నిరసనాగ్రహం

– ప్రత్యేక హోదాపై బాబు వైఖరికి నిరసనగా ఆందోళనలు
= రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన  ర్యాలీలు
–వైయస్‌ఆర్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు
–నిరసన ప్రదర్శలను అడ్డుకున్న ఖాకీలు
–పోలీసు నిర్భందాలను లెక్క చేయని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు సర్కార్, పోలీసులు అనుసరించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి ప్రత్యేక హోదా– ఏపీ హక్కు అంటూ నినదించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ సహా జానకీరామరాజు, గొర్లి సూరిబాబులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

– గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్‌ిర రాజశేఖర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
– అనంతపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు శకంర్‌ నారాయణను సైతం పోలీసులు గృహ నిర్భంధం చేశారు.
– తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో భూమన కరుణాకర్‌ రెడ్డి,  ఎంపీ వరప్రసాద్‌ పాల్గొన్నారు.
– పులివెందులలో మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అవినాష్‌రెడ్డి.
– రైల్వేకోడూరులో వైయస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అధ్వర్యంలో ధర్నా.
– ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్ల శివప్రాసద్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ.
– కృష్ణా జిల్లా నందిగామలో రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్‌ హౌస్‌ అరెస్ట్‌.
– శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు అరెస్ట్‌.
– ప్రకాశం జిల్లా దర్శిలో కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా.
– ఏలూరులో గుడిదేశి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నా. ధర్నాలో పాల్గొన్న బొద్దాని శ్రీనివాస్, మైబాబు.
– తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా.
– దెందులురులో కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా.
– చిత్తూరు నారాయణవనంలో కోనేటి ఆదిములం ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ.
– వరదయ్యపాల్యంలో దయాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన.
– విశాఖ జిల్లా చోడవరం సమన్వయకర్త కరణం ధర్మ ఆధ్వర్యంలో ధర్నా.
– మడుగుల ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా.
– పశ్చిమ గోదావరి చింతలపుడిలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ, నవీన్‌బాబు ఆధ్వర్యంలో నిరసన.
– రణస్థలంలో గొర్లు కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరసన, అరెస్ట్‌.
– హిందుపురంలో నవీన్‌ నిచ్ఛెల్‌ హౌస్‌ అరెస్ట్‌. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ధర్నా, అరెస్ట్‌.
– ఆలూరులో వీర్‌ విక్రాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ.
– తిరువురులో ౖవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మౌన ప్రదర్శన.
– కశింకోటలో ఎం. బుల్లిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో, అరెస్ట్‌.
– దర్శిలో బుచెపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ.
– అవనిగడ్డ తహసీల్దార్‌ ఆఫీసు వద్ద సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో నిరసన.
– ఎమ్మిగనూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఎరక్రోట జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
–కొయ్యాలగూడెంలో ఆళ్లనాని ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
–అప్పనవీడు, పెద్దపాడు మండలాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
–çపశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు
–కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
–అచంట నియోజకవర్గంలో కౌరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా 
–మాజీ ఎమ్మెల్యే స్రరాజు వీ్రరాజు ఆధ్వర్యంలో ధర్నా
–నందిగామాలో ధ్నాను అడ్డుకున్న పోలీసులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అరుణ్‌కుమార్‌ అరెస్టు
–పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ధర్నా
–తెనాలిలో అన్నబత్తుల శివకుమార్‌ ఆధ్వర్యంలో ధర్నా
–మంగళగిరిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నిరసన ప్రదర్శన
–చీరాలలో యడం బాలాజీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
–పుల్లెల చెరువులో ఉడుముల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన
–గిద్దలూరులో ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
–మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
–దర్శిలో బూచేపల్లి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
– వైయస్‌ఆర్‌ జిల్లా సంబేపల్లిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధర్నా
–కదిరిలో డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
–తిరుపతి ఎస్వీయూలో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా
–పలాసలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ
–సొంపేటలో మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌ ఆధ్వర్యంలో రాస్తారాకో, అరెస్టు
–మాడుగులలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ఆందోళన
– హిందూపురంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత నవీన్‌ నిచ్చెల ఆధ్వర్యంలో ధర్నా, పోలీసుల అరెస్టు
–ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.
–నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో
–కాకినాడ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ముత్తా శశిధర్‌ ఆధ్వర్యంలో ధర్నా
–తాడిపత్రిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త పెద్దారెడ్డి హౌస్‌ అరెస్టు
–అచంటలో కౌరు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు
–నిడదవోలులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఆధ్వర్యంలో ర్యాలీ
–చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ధర్నా
–గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
–రాజమండ్రిలో రౌతు 
–అనంతపురంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళనలో పాల్గొన్న పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథ్‌రెడ్డి
–మండపేటలో లీలాకృష్ణ ఆధ్వర్యంలో దున్నపోతులతో నిరసన ప్రదర్శన
–తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
–నెల్లూరు జిల్లా అనంతపురంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
–నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, వైయస్‌ జగన్‌ ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే అనిల్‌
–కర్నూలు జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చరితారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
–ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు

Back to Top