రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ధ‌ర్నాలు

హైద‌రాబాద్‌) క‌రువు, తాగునీటి ఎద్ద‌డి వంటి స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్య వైఖ‌రి అనుస‌రిస్తున్నందుకు నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీ ఆందోళ‌న బాట ప‌డుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండ‌ల కేంద్రాల‌లో నిర‌స‌న లు చేప‌డుతోంది. త‌హ‌శీల్దార్ లేదా మండ‌ల కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న చేప‌డుతోంది. ఖాళీ బిందెల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వహిస్తున్నారు.  పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల తో క‌లిసి ధ‌ర్నాలు చేపట్టారు. ప్ర‌భుత్వానికి బాధ్య‌త‌ను గుర్తు చేయ‌టానికి దీన్ని ఉద్దేశించారు. 
Back to Top