పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఎంపీల ధర్నా

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఉదయం  పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్‌లు ధర్నా నిర్వహించారు.  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. నిన్న ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించిన విషయం విధితమే. రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేసేందుకు శాంతియుతంగా వెళ్తున్న పార్టీ నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తిరిగి ఈ రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడంతో లోపల, బయట ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధమైంది.
 
Back to Top