వంచన వ్యతిరేక దీక్ష ప్రారంభం

 
- మ‌హానేత విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు
- దీక్ష‌లో కూర్చున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియ‌ర్లు 
- దీక్షాస్థ‌లికి భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు 
- విశాఖ‌లో మారుమ్రోగుతున్న ప్రత్యేక హోదా నినాదాలు

విశాఖపట్నం: ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని బీజేపీ దగా కోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా ఇవాళ ఉద‌యం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌ను ప్రారంభించారు. ముందుగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పార్టీ నేత‌లు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం దీక్ష‌లో ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, పార్టీ సీనియ‌ర్లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఉమ్మారెడ్డివెంక‌టేశ్వ‌ర్లు, అనంత వెంక‌ట్రామిరెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, త‌దిత‌రులు దీక్ష చేప‌ట్టారు.  వంచన వ్యతిరేక నిరాహారదీక్షకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు త‌ర‌లిరావ‌డంతో దీక్షాస్థ‌లం పోటెత్తింది. పాట‌లు, హోదా నినాదాల‌తో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సమీపంలో మహిళా జూనియర్‌ కళాశాల ప్రాంగ‌ణం ద‌ద్ద‌రిల్లుతోంది. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ తోపాటు రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు సోమవారం ప్రత్యేక హోదా కోసం ‘ధర్మ పోరాటం’ అంటూ తిరుపతిలో దీక్షకు పూనుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తామంతా ముందుంటామని ముక్తకంఠంతో నినదించడంతోపాటు కేంద్రం ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం తుదికంటా పోరాడతామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భరోసా ఇచ్చారు. చంద్రబాబు దీక్షలకు పూనుకోవడం అధికారం కోసం వేస్తున్న ఎత్తుగడలే తప్ప మరొకటి కాదన్నారు.  వంచన వ్యతిరేక దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవ ర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Back to Top