వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు


విజయవాడ: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఇదివరకే వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చుతామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ స్కీంతో ఎలాంటి నష్టం లేదన్నారు. త్రిపుర, బెంగాల్‌ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని గౌతంరెడ్డి డిమాండు చేశారు. ఉద్యోగులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.
 
Back to Top