పేదవాడు అలాగే ఉండిపోవాలన్నదే బాబు అభిమతంమేనిఫెస్టోలో పెట్టిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు
– బీసీలను ఎలా వాడుకోవాలనేది చంద్రబాబుకు బాగా తెలుసు
– బీసీలను జడ్జిలు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు
– ఓట్ల కోసం అన్ని చేస్తాన న్న బాబు..ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదంటున్నారు
–వైయస్‌ఆర్‌తో స్నేహం వల్ల చంద్రబాబు మంత్రి అయ్యారు
–  ప్రతి బీసీ సోదరుడికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది
– అందరూ చదువాలనే వైయస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు
– బాబు దృష్టిలో నాలుగు కత్తెర్లు..ఇస్తీ్ర పెట్టేలు ఇవ్వడమే బీసీలపై ప్రేమ
– పేదరికం పోవాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గం
– పిల్లల చదువుకు ఎన్ని లక్షలు ఖర్చైనా మన ప్రభుత్వమే భరిస్తుంది
– హాస్టల్‌లో ఉండే పిల్లలకు మెస్‌ ఛార్జీల కోసం రూ. 20 వేలు అందిస్తాం
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌
– రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే
– ప్రతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలో కూర్చోబెడతా

పశ్చిమ గోదావరి: పేదవాడు అలాగే ఉండిపోవాలన్నదే చంద్రబాబు అభిమతమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. బాబు దృష్టిలో నాలుగు కత్తెర్లు..ఇస్తీ్ర పెట్టేలు  ఇవ్వడమే బీసీల అభివృద్ధి అనుకుంటున్నారన్నారు. బీసీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీసీలను ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు అన్నారు. బీసీలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మల్లవరంగ్రామంలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

– ఈ గ్రామంలో బీసీల సమ్మేళనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సమ్మేళన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నన్ను పిలువడం చాలా సంతోషంగా ఉంది.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసిన తరువాత..మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయన్న వాతావరణం చూస్తున్నాం. ఒక్కసారి మనమంతా కూడా గుండెలపై చేతులు వేసుకోని ఆలోచన చేయాలి. మనకు మంచి జరిగిందా? అభివృద్ధి అంటే ..నిన్నటి కంటే ఈ రోజు బాగుండటాన్ని అభివృద్ధి అంటారు. నిన్నటి కన్న చంద్రబాబు హయాంలో ఇవాళ బాగున్నామా? ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే..ఐదు అంశాలు మాత్రమే చెబుతున్నాను.
– చంద్రబాబు మైక్‌ పట్టుకుంటే బీసీలపై ప్రేమ అంటారు. కుప్పం సీటు చూస్తే..ఈయనకు బీసీలపై ఎంత ప్రేమో అర్థమవుతుంది. నారా వారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. 1978లో చంద్రబాబు మొట్టమొదటి సారి చంద్రగిరి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ టికెట్టుపై పోటీ చేస్తే అప్పట్లో 2400 ఓట్లతో గెలిచారు. చంద్రబాబుకు, నాన్నగారికి స్నేహం కూడా మీ అందరికి తెలుసు. నాన్నగారి పుణ్యనా చంద్రబాబు మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రి పదవి కూడా తీసుకొని 1983లో ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టిన తరువాత చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేశారు. మంత్రిగా పని చేసేవాడు తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు. అటువంటిది చంద్రబాబు మాత్రం 1983లో టీడీపీపై ఓడిపోయారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ కూతురుని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ చంద్రబాబును దగ్గరికి తీశారు. దగ్గరికి తీసిన ఎన్టీఆరే చివరకు ఎందుకు చంద్రబాబును ప్రోత్సాహించానా అని మదన పడ్డారు. 1985 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు. 1989లో టీడీపీ తరఫున చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కుప్పంలో అత్యధిక ఓటర్లు బీసీలే. చేతనైతే ఓసీ నియోజకవర్గంలో పోటీ చేయాలి కానీ. ఎన్టీఆర్‌ అల్లుడిగా ఉన్న వ్యక్తి సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బయపడి..బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈయనకు బీసీలపై ప్రేమ అన్నది ఎప్పుడు ఉండదు. ఎన్నికల్లో ఎలా వాడుకోవాలో తప్ప..బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడు లేదన్నది చెప్పడానికి ఇదే నిదర్శనం
– ఈ నాలుగేళ్లలో చంద్రబాబు పాలన చూశాం. ఇటీవల హైకోర్టు జడ్జి ఈశ్వరయ్య రిటైర్డు అయ్యారు. ఆయన ఈ మధ్య మీడియా సమావేశంలో ‘‘చంద్రబాబు బీసీలను జడ్జిలు కాకుండా అడ్డుకున్నారు’’ అని ఆయన రాసిన లేఖలు బయటపెట్టారు. మన ఖర్మ సాక్షిలో తప్ప మరే పేపర్లో రాలేదు. ప్రతి విలేకరికి పంపించినా ఎవరూ రాయలేదు. అమర్‌నాథ్‌గౌడు జడ్జిగా అర్హుడు కాడని చంద్రబాబు లేఖ రాశారు. 
– చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో బీసీలపై ప్రేమ అంటూ నాలుగు పేజీలు కేటాయించారు. దాదాపు 104 వాగ్ధానాలు చేశారు. రూ.10 వేల కోట్లు బీసీలకు బడ్జెట్‌లో కేటాయిస్తానని చెప్పారు. నాలుగేళ్లలో ఆయన కేటాయించింది ఎంత అంటే రూ.13,700 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఈయన చెప్పిన దాంట్లో 20 శాతమే ఖర్చు చేశారు. ఈయన వచ్చిన తరువాత సంక్షేమ హాస్టల్స్‌ మూత వేయించారు. నారాయణ, చైతన్యలకు మేలు చేసేందుకు ఎడాపెడా హాస్టల్స్‌ మూత వేయించారు. చేసిన వాగ్దానాల్లో అన్యాయమని తెలిసి కూడా, తన చేతుల్లో లేదని గ్రమించి కూడా మోసం చేశాడు. రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటారట. ఇది రాష్ట్ర పరిధిలో లేదని తెలిసి కూడా హమీ ఇచ్చారు. కురుబ, కురుమలను బీసీబీ నుంచి ఎస్టీలుగా గుర్తిస్తారట, వాల్మీకులు,బోయలను ఎస్టీలుగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటారట. మత్స్యకారులను కూడా ఎస్టీలుగా చేస్తానన్నారు. తన చేతుల్లో లేదని తెలిసీ కూడా ఓట్ల కోసం అన్నీ చేస్తానని మాట ఇచ్చారు. ఇవాళ నా చేతుల్లో లేదు..కేంద్రం చేయాలని తప్పించుకుంటున్నారు. ఆ నెపాన్ని వేరే వారిమీద నెట్టుతున్నారు. చంద్రబాబు చేసిన దారుణ మోసం ఏంటో తెలుసా? పేదవాడు అన్నవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తారంటే ఒక్కడైనా ఇంజినీర్‌గా, డాక్టర్‌గా కావాలని నాన్నగారు అనే వారు. నాన్నగారి హాయంలో ఏ పేదవాడైనా సరే తన బిడ్డలను ఇంజినీర్, డాక్టర్‌ చదివించేందుకు ఆలోచించేవారు కాదు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే పథకాన్ని దేశంలోనే ఎక్కడా చూడలేదు. చంద్రబాబు ఎన్నికల సమయలో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తా అంటారు. ఎన్నికలు అయిపోయిన తరువాత దగ్గరుండి తూట్లు పొడుస్తున్నారు. చాలా మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదు. ఇచ్చే ముష్టి రూ.35 వేలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పులు చేసి, ఆస్తులు అమ్మి చదివించుకోవాల్సి వస్తోంది. నాలుగు కత్తెర్లు, నాలుగు  ఇస్తీ్ర పెట్టెలు అనిచంద్రబాబు అంటారు.ఇదేనా బీసీలపై ప్రేమా? బీసీలు బాగా చదవాలన్న ఆలోచన చంద్రబాబుకు రాదు.
– ఇంతటి దారుణమైన పాలన నాలుగేళ్లలో చూశాం. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ప్రతి పేదవాడికి, బీసీకి మనం ఏం చేస్తామన్నది నవరత్నాల ద్వారా ప్రకటించాం. ఈ నవరత్నాల నుంచి బీసీలకు మేలు చేసే అంశాలు మీకు చెబుతాను. సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇంకా ఏం చేయాలో మీరే చెప్పండి. మీ అభిప్రాయాలు తీసుకుంటాం. బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచి మేలు చేస్తాం.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా మార్చేస్తామని మాట ఇస్తున్నాను. మళ్లీ వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తాను. నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. ఇవాళ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్ఛైనా ఫర్వాలేదు..దగ్గరుండి నేను చదివిస్తాను. మీ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివేందుకు హాస్టల్‌లో ఉండేందుకు అయ్యే ఖర్చును కూడా నేనే భరిస్తాను. ప్రతి విద్యార్థికి ప్రతి ఏటా రూ.20 వేలు హాస్టల్‌ ఖర్చులకు ఇస్తానని మాట ఇస్తున్నాను. మన తల రాతలు మారాలంటే మన పిల్లలు ఉన్నత చదువులు చదవాలి. అప్పుడే పేదరికం నుంచి బయటకు వస్తాం. ఆ పునాదులు ఆ చిట్టి పిల్లల నుంచే పడుతాయి. ఈ చిట్టిపిల్లలు బడి బాట పడితే..అక్కడ పునాదులు పడతాయి.వారు రేపు పొద్దున ఉన్నత చదువులు చదువుతారు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు హామీ ఇస్తున్నాను. మీ పిల్లలను బడికి పంపించినందుకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తాం. ఏ బడికి పంపించినా సరే..ఆ డబ్బులు ఇస్తాం. మన రాష్ట్రంలో 32 శాతం మందికి చదువు రావడం లేదు. పేదరికం కారణంగానే చదువుకోలేదు. ప్రతి పేదవాడికి చదువు తీసుకొని వచ్చి తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక ఏపీలో చదువురాని వాడు ఒక్కడు కూడా లేకుండా చేస్తాను.
– బీసీలు, పేదల కోసం పింఛన్లు ఇస్తాం. అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది పింఛన్‌ పెంచేందుకు చంద్రబాబుకు మనసు రాదు. పింఛన్లు పెంచితే చంద్రబాబుకు కమీషన్లు రావు కాబట్టి కాంట్రాక్టర్లకు మాత్రమే అడకపోయినా రేట్లు పెంచుతారు. ఆ అవ్వతాతల కోసం పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాం. రూ.1000 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతాం. పేదరికంలో ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. వారం రోజులు పనులకు వెళ్లకపోతే పస్తులుంటున్నారు. ఇలాంటి వారి కోసం పింఛన్‌  వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాం. దాని వల్ల ఈ అక్కలు రేపటి గురించి ఎలా బతకాలన్న పరిస్థితి రాకుండా చేస్తాం. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటానని చెబుతున్నాను. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి సక్రమంగా జరిగితే నిజంగా నా జన్మ ధన్యమైనట్లే.
– ఆయా సామాజిక వర్గాలకు ఏం చేయాలో ఇప్పటికే చెప్పాను. మీ సలహాలు తీసుకుంటున్నాను. ప్రతి బీసీ కులానికి వారి వారి కులాల చొప్పున కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తోడుగాఉంటానని మాట ఇస్తున్నాను. ఇంకా ఏం చేయాలో మీరే సలహాలు, సూచనలు ఇవ్వండి. ఇలోగా బీసీ అధ్యాయన కమిటీ ప్రతి నియోజకవర్గంలో పర్యటించి మీ సలహాలు, సూచనలు తీసుకుంటుంది. 
–––––––––––––––––––
– రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే ఇస్తామని మాట ఇచ్చారు.
– బీసీ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని క్షుణ్ణంగా చదివి..ఎటువంటి ఒత్తిడి లేకుండా ఏ,బీ,సీలో ఎవరిని పెట్టాలో వారే నిర్ణయించాలి. ప్రతి రాజకీయ నాయకుడు బీసీలను ఏలో పెడతాం, బీలో పెడతామని హామీలు ఇస్తున్నారు. ఇది సరైంది కాదు. ఎక్కడైతే చట్టసభల్లో ప్రతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీలుగా గుర్తించి చట్టసభలోకి తీసుకొస్తామని మాట ఇస్తున్నాం.
– ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చే కార్యక్రమం చేస్తాం
– ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మార్పు చేస్తాం.
– ఎక్కడ పుడితేనేమి..సర్టిఫికెట్‌  ఇవ్వకపోవడం సరికాదు. ఓబీసీకి సంబంధించి అందరం కలిసి పోరాటం చేద్దాం
 
Back to Top