బాబు పాలనలో దుర్భిక్షంలో వ్యవసాయం

పశుగ్రాసం లేక పశువులు కబేళాకు తరలింపు
కుప్పం నియోజకవర్గంలో అన్ని కరువు మండలాలే
అన్నపూర్ణ ఆంధ్రను కరువు రాష్ట్రంగా మార్చారు
ఈ ఏడాది 14 లక్షల హెక్టార్ల సాగుభూమి బీడుగా మారింది
ఏటా గణనీయంగా తగ్గుతున్న పంటల సాగుబడి
అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ
హైదరాబాద్‌: చంద్రబాబు పాలనలో వ్యవసాయరంగం తీవ్ర దౌర్భాగ్యంలో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైలు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పడిపశువులకు పశుగ్రాసం లేక కబేళాలకు తరలించే దుస్థితి ఏర్పడిందన్నారు. వాస్తవాలను పక్కన బెట్టి చంద్రబాబు గణనీయమైన వృద్ధిరేటు సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో పంటల సాగు తగ్గుముఖం పడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మండలాలన్నీ కరువుతో అల్లాడుతున్నాయన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా పేరు తెచ్చుకున్న రాష్ట్రాన్ని కరువు కాటకాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే...
– 11 లక్షల ఎకరాల సాగునీటి వనరులు కలిగి 140 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్న నాగార్జున సాగర్‌ కుడి కాల్వకు నాలుగేళ్లలో నీరు విడుదల కాలేదు. పశువుల కోసం రూ.10 నుంచి రూ.12 వేలు వెచ్చించి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సిన దుస్థితి. కొందరు ఒక పాడి ఆవు, గేదెను మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటిని కబేళాకు తరలిస్తున్నారు. 
– వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత అంకెలు చూపించి ప్రజలను మోసం చేస్తుంది.  
2015–16లో వ్యవసాయంలో వృద్ధి రేటు 12 శాతం, 2016–17లో 14 శాతం సాధించామని మోసపూరిత ప్రకటన చేసింది. అదే విధంగా 2017–18కి సంబంధించి 16 శాతం అంటారేమోనని అనుమానంగా ఉంది. 
– నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన సాగు వివరాలు ఏపీ అగ్రినెట్‌. నెట్‌.గౌట్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో నుంచి తీయడం జరిగింది. 
– 2008–09లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఖరీఫ్‌ సీజన్‌లో 43.86 లక్షల హెక్టార్‌లలో సాగు జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం 2014–15లో 40.96, 2015–16లో 36.34 లక్షలు, 2016–17లో 38.68 లక్షల హెక్టార్‌లకు, ఈ సంవత్సరంలో 35.9 లక్షల హెక్టార్‌లకు పంటల సాగు పడిపోయింది. 
– చంద్రబాబు నాయుడు నా రికార్డులు నేనే బ్రేక్‌ చేస్తానని చెబుతుంటాడు. ఆయన కరువు రికార్డులను ఆయనే బ్రేక్‌ చేస్తున్నారు. రబీ సాగు తీసుకుంటే వైయస్‌ఆర్‌ హయాంలో 27.26 లక్షల హెక్టారుల్లో సాగు. అదే చంద్రబాబు హయాంలో 2014–15లో 23.39 లక్షలు, 2015–16లో 19.9 లక్షలు, 2016–17లో 19.9 లక్షల హెక్టార్లు మాత్రమే సాగు, గతేడాది అతితక్కువ సాగు జరిగింది. 
– 2014–15లో రెండు పంటలకు కలిపి 6.97లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా మిగిలిపోయింది. 2015–16లో 11.39 లక్షలు, 2016–17లో 12.56 లక్షల ఎకరాలు, ఈ ఏడాది 14 లక్షల ఎకరాలు బీడు భూమిగా మిగిలిపోయింది. వాస్తవాలు ఇలా ఉంటే దానికి విరుద్ధంగా ప్రకటనలు చేయడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిపోయింది. 
– కరువు మండలాలను తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం మండలాలు 664 మండలాలు, రాయలసీమలో 234, 2014–15లో 238 కరువు మండలాలకు రాయలసీమలో 155 మండలాలు ఉండగా రాష్ట్రంలో 6.97 ఎకరాల్లో సాగుపడిపోయింది. 2015–16లో రాష్ట్రం మొత్తం 359 మండలాలు, రాయలసీమలో 239 మండలాలు ప్రకటించగా 11.39 లక్షల ఎకరాలు బీడుభూమి, కానీ వృద్ధి రేటు 12 శాతం అని ప్రకటించారు. 2016–17లో 301 మండలాలు, రాయలసీమలో 197, 12.56 లక్షల ఎకరాల్లో సాగుపడిపోయింది. వృద్ధి రేటు 14 శాతం అని ప్రకటించారు. ఈ సంవత్సరంలో 14 లక్షల ఎకరాల్లో సాగు పడిపోతే 16 శాతం ప్రకటిస్తారో చూడాలి. 
– ఇంత దుర్భిక్షమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఈ ప్రకటనలు దేనికి బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే తీరేనా ఇది చంద్రబాబూ. 
– కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో ఆంధ్రపదేశ్‌ను అన్నపూర్ణ రాష్ట్రంగా పిలిచేవారు. దానికి కారణం కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లోని వరిపంట మూలంగా ఆ పేరు వచ్చింది. 
– అటువంటిది వరిసాగు తీసుకుంటే వైయస్‌ఆర్‌ పాలన 2008లో 17.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 2014లో 16.3 లక్షల ఎకరాలకు, 2015లో 13.7, 2016లో 14.7 లక్షలు, ఈ సంవత్సరం 14.3 లక్షల ఎకరాలకు ఖరీఫ్‌లో వరిసాగు తగ్గుముఖం పట్టింది. 
– అన్న పూర్ణగా పేరొందిన రాష్ట్రంలో వరిసాగు ఇంత ఎక్కువగా తగ్గిపోయింది. వరి తరువాత వేరుశనగ అత్యధికం పంట పండుతుంది. 2008లో 9.30 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. 9 లక్షలు కేవలం రాయలసీమలో మాత్రమే జరిగింది. చంద్రబాబు హయాంలో ఈ ఏడాది 6.56 ఎకరాలకు వేరుశనగ పంట సాగు పడిపోయింది. గత సంవత్సరం సాగు జరిగిన వేరు శనగ పంట చేతికి రాకుండా ఎండిపోయిన పరిస్థితి. 
– రాయలసీమలో కంది, కృష్ణా డెల్టాలో మినుము ప్రధాన పంటలు. పప్పు ధాన్యాలు కూడా 2008లో 4.9 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. ఈ సంవత్సరం 3.63కు పడిపోయింది. 2014లో 1.94 హెక్టార్లకు పడిపోయింది. ప్రభుత్వ లెక్కలు ఈ విధంగా చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం వృద్ధి రేట్లు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. 
– చిత్తూరు జిల్లా 66 మండలాలు, చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని అన్ని మండలాలు కరువు మండలాలే. 
– గత సంవత్సరంలో పసుపు, మిర్చి, కంది, మినుము, పెసర, శనగ దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. 
–రాష్ట్రంలో ఇంతకు మందు ఎప్పుడు లేని విధంగా తెగుళ్లతో వేరుశనగ మాడిపోయింది. ఈ సంవత్సరం  చరిత్రలో లేని విధంగా వేల హెక్టార్లు దుక్కిదున్నిన పరిస్థితి. దిగబడులు గణనీయంగా పడిపోయాయి. 
– సుబాబులు, జామాయిలు రైతుల పరిస్థితి కూడా దుర్భరంగా ఉంది. రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి. 
– స్వామినాథన్‌ కమిటీ సిఫారస్సుల ప్రకారం పంట దిగుబడులకు అదనంగా 50 శాతం కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి చంద్రబాబు ఊరువాడ చెప్పారు. 
– ఒక్కసంవత్సరం అయినా పండించిన పంటలకు మద్దతు కల్పించారు. 
– ముఖ్యమంత్రిగారు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి అసెంబ్లీ సీట్లు పెంచాలని తప్ప రైతులకు ఉత్పత్తి ధరలు పెంచాలని అడిగిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను కూడా కల్పించకపోవడంతో అరకొర ధరలకు రైతులు అమ్ముకున్న పరిస్థితి. 
– కేంద్ర ప్రభుత్వ ఫజల్‌ బీమా యోజన పథకం కింద నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీలు కేటాయించాలేదన్నారు. 
– రాష్ట్రంలో పాడిపరిశ్రమ మనుగడ మరీ దయనీయంగా తయారైంది. పంటలు పండకపోవడంతో వరిగడ్డి దొరక్క పశువులను కబేళాకు తరలిస్తున్నారు.  
– సహకార డెయిరీలను మూతపెట్టిన ఘనత చంద్రబాబుది. చిత్తూరు జిల్లాలో రైతులంతా పాడిపరిశ్రమపై బతుకుతున్నారు. ఏపీలో 300 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పాపులేషన్‌ 4.9 కోట్లు, పక్కన కర్ణాటక రాష్ట్రంలో పాడిపరిశ్రమలో 6.40 కోట్ల పాపులేషన్‌. 
– కర్ణాటక వారు ఇతర రాష్ట్రాలకు పాలపొడి, నెయ్యిని ఎగుమతి చేస్తున్నారు. ఏపీ కూడా కర్ణాటక నుంచి తెచ్చుకుంటుంది. తక్కవ పాపులేషన్‌ ఉన్న ఏపీ కర్ణాటక నుంచి ఎలా తెచ్చుకుంటుంది. 
పాడిపరిశ్రమ వృద్ధిరేటు 16 శాతం, ఆక్వా రంగ వృద్ధిరేటు 40 శాతం ఈ రెండింటిని చూపించి రెండంకెల వృద్ధిరేటు సాధించామని చెప్పడం దుర్మార్గం. 
– ఇంతకు ముందు ఒక వీడియో చూసినప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనుబంధ రంగాల వృద్ధిరేట్లు అన్ని దీనిలోకి వచ్చాయని, ఆక్వాపరిశ్రమ బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు. లేనిరిపోర్టులను పేపర్లపై చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. 
చంద్రబాబు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను అందుకే నా సర్వీస్‌ రెండు సంవత్సరాలు పొడిగించారని చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబు లెక్కలన్నీ కాగితాలకే సంబంధించినవని అర్థం అవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకొని వ్యవసాయరంగంపై దృష్టి సారించాలి. 
 
Back to Top