ఎన్‌టీఆర్‌ చావుకు బాబే కారణం

 


– ధాన్యగారంగా ఉన్న జిల్లాలో ధాన్యం పండించడానికి ఇబ్బందులు
– గోదావరి జిల్లా గ్రామాల్లో తాగునీరు, సాగునీరు కరువు
– భీమవరంలో వైయస్‌ఆర్‌  82 ఎకరాల్లో 700 ఇల్లు కట్టించారు
– పేదల ఇళ్ల పేరుతో చంద్రబాబు స్కాం చేస్తున్నారు
– పైన చంద్రబాబు దోచుకుంటున్నారు
– గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయి
– ప్రతి కులాన్ని, వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు
– నెట్‌లో టీడీపీ మేనిఫెస్టోను తీసేశారు
– ఆక్వా పార్క్‌ వద్దని తుందు్రరు వాసులు నినదిస్తున్నారు
– ఆక్వా బాధితులపై 30 రకాల కేసులు పెట్టారు
– ఆక్వా పార్క్‌ను సముద్ర తీరం దగ్గరకు మారుస్తాం
– మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి.. ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తాం
– హాస్టల్‌ ఖర్చులకు ప్రతి విద్యార్థికి రూ.20 వేలు
– వైయస్‌ఆర్‌ అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు
పశ్చిమ గోదావరి: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు చావుకు చంద్రబాబే కారణమని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇవాళ ఆయన ఫొటోకే దండేస్తున్నారని, ఇది ఆయన నైజమన్నారు. నాలుగేళ్లు చంద్రబాబు పాలనలో ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, ఏడాదిలో  ఎన్నికలు ఉన్నాయని గ్రహించి ఇవాళ దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆక్వా రంగానికి అనుబంధంగా ఉన్న ఐస్‌ఫ్యాకర్టీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.5లకే యూనిట్‌ కరెంటు ఇస్తానని, సీడ్‌ దగ్గర నుంచి దాణా దాకా కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 
ఆక్వా రంగంలో దళారీ వ్యవస్థ వ్యవస్థ రైతులు పూర్తిగా నష్టపోతున్నారని, దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏ మన్నారో వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

–  కన్నులెత్తి చూస్తే..కంటి చూపు మేరకు ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఎండా కాలం అన్న సంగతి అందరికి తెలిసిందే. ఎండలు తీక్షణంగా ఉన్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఒక వైపున కష్టాలు చెబుతున్నారు. మరోవైపు నా భుజాన్ని తడుతూ..అన్నా ..మేమంతా నీకు తోడుగా ఉన్నామని చెబుతున్నారు. ఏ ఒక్కరికి ఈ ఎండలో నాతో పాటు నడవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. నడిరోడ్డుపై దుమ్ములో, ధూళిలో నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా చిక్కని చిరునవ్వుతో ప్రేమానురాగాలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
– – ఈ నియోజకవర్గంలో అడుగు పెడుతూనే..అన్నా..పేరుకే మాది గోదావరి జిల్లా. అయినా సాగునీరు లేదు..తాగునీరు లేదని చెప్పారు. అన్నా..మేం తాగే నీళ్లు ఒకసారి చూడండి అని ఇలాంటి బాటిల్‌ ఇస్తున్నారు. ఈ బాటిల్‌ను మీ తరఫున చంద్రబాబుకు చూపుతున్నాను. అయ్యా చంద్రబాబు ఇది చెరుకు రసం కాదు..ఇక్కడి ప్రజలు గ్రామాల్లో తాగే నీరు. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాను. ఈ బాటిల్‌ పెదామురం గ్రామంలో ఓ అక్క ఇచ్చింది. అన్నా..మీటింగ్‌లో కచ్చితంగా చెప్పండి అని కోరింది.
– డెల్టా కాల్వలు ఉన్నాయి కానీ..ఒక్క సారి కూడా మరమ్మతులు చేయలేదన్నా..వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారి కూడా మా జిల్లాకు రాలేదని చెబుతున్నారు. ధాన్యకార్మాగారమైన ఈ జిల్లాలో ధాన్యం పండించేందుకు అగచాట్లు పడుతున్నారు. ఇదే నియోజకవర్గంలో జరుగుతున్న స్కాంలు, పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి.
– అన్నా..భీమవరంలో టీడీపీ నాయకులకు చంద్రబాబు బ్రహ్మండంగా ట్రైనింగ్‌ ఇచ్చారని చెబుతున్నారు. ఏది ముట్టుకున్నా అవినీతి కనిపిస్తుందన్నా..ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఇల్లు లేవని అడిగితే 82 ఎకరాలు కొనుగోలు చేశారన్నా..దాదాపు 700 పైచిలుకు ఇల్లు కట్టించారు. 5 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పారు. అన్నా..నాన్నగారి ఇచ్చిన పట్టాలపై చంద్రబాబు కళ్లు పడ్డాయి. ఈ పట్టాలను లాక్కోవాలని చంద్రబాబు ఆదేశించారు. అన్నా..స్కాంలు చూడండి ఎలా ఉన్నాయో?
– పేదవాళ్ల ఇళ్ల నిర్మాణంలో స్కామ్‌లు చేసేవారిని ఏమంటారు? పేదలకు ఉచితంగా ఇచ్చిన స్థలాలు లాక్కున్నారు. అక్కడ పేదలకు ఇల్లు కట్టిస్తారట. ప్లాట్‌ కట్టాలంటే లిప్టులు, మార్బల్‌ ప్లోరింగ్‌ లేనప్పుడు రూ.1000 కూడా పట్టదు అని ఇంజినీర్లు చెబుతున్నారు. చంద్రబాబు ఇక్కడ ప్లాట్లు కడుతానని చెబుతూ..300 అడుగుల ప్లాట్‌ కడుతారట. దీన్ని అడుగుకు రూ. 2000 చొప్పున చంద్రబాబు పేదవాడికి అమ్ముతున్నారు. రూ.6.50 లక్షలు అవుతుందట. ఇందులో రూ.3.50 లక్షలు పేదవాడికి అప్పుగా ఇస్తారట. ఈ డబ్బులకు పేదవాడు 25 ఏళ్ల పాటు కంతులు కట్టాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..కంతులు కట్టాల్సింది పేదవాడా?. ఆ ప్లాట్లు ఇస్తే తీసుకోండి. రేపుపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్లాట్‌ మీద బ్యాంకులకు కట్టాల్సిన రూ.3.50 లక్షలు మాఫీ చేస్తాను. అవినీతి చేసిన ఈ చంద్రబాబును, ఈ బిల్డర్‌పై ఎలాంటి కేసులు పెట్టాలో నేను చూసుకుంటా.
– ఇదే భీమవరంలో జరుగుతున్న స్కాంలు చూడండి అంటున్నారు. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి సమస్య పరిష్కారం కోసం చెరువులు తవ్వించమంటే వెంటనే 150 ఎకరాలు కొనుగోలు చేసి చెరువులు తవ్వించారని చెబుతుంటే గర్వపడ్డాను. మరోవైపు అన్నా..ఇక్కడి టీడీపీ నాయకుల పాలన చూడండి అంటున్నారు. భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో మంచినీటి కోసం చిన్న చెరువులు తవ్వి..దాని ద్వారా నీరు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించారన్నారని చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు ఈ పథకం పూర్తి చేయడానికి చిత్తశుద్ది చూపడం లేదు. రైతులకు కళ్లబొల్లి మాటలు చెప్పి స్థానిక ఎమ్మెల్యే భూములు తీసుకుని మోసం చేసే క్రమంలో కేంద్రం గమనించి ఈ ప్రాజెక్టును కట్టకుండా వెనుకడడుగు వేసింది. ఈ క్రమంలో రైతులు మా భూములు వెనక్కి ఇవ్వండి అంటే టీడీపీ నాయకులు ముందుకు రావడం లేదు. ఇంతకన్నా దారుణమైన స్కాంలు ఎక్కడైనా ఉంటాయా?
– భీమవరంలో అవినీతి కంపు కొడుతుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. కాంపౌస్టు యార్డు పెట్టాలని, చెత్తాచెదారం వేసేందుకు 50 ఎకరాలు సేకరించారు. అధికారుల చేత వ్యవస్థలను వాడుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు ఫలాని చోట వస్తుందని రైతుల వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేవారు. 50 ఎకరాలు చౌకగా కొట్టేశారు..ఆ తరువాత జెండాపై కపిరాజు అన్నారు. ఇంతటి దారుణంగా ఇవాళ అవినీతి ఉందని చెబుతుంటే బాధనిపించింది. 
– యలమందుల డ్రైన్‌ చూస్తే దారి పొడవునా చెత్తా చెదారం కనిపిస్తోంది. ఇవాళ కాల్వలో నీళ్లు చెరుకు రసం కంటే దారుణమైన కలర్‌లో ఉన్నాయి. చంద్రబాబు మైక్‌ పట్టుకుంటే చాలు దాన్ని మార్చేశానని అసెంబ్లీలో కూడా చెప్పారు. ఇదే జిల్లాలో దాదాపుగా 15 నియోజకవర్గాలు టీడీపీకి కట్టబెడితే చంద్రబాబు ఏం చేశారు.
– ఇదే నియోజకవర్గంలో ట్రాఫిక్‌ కష్టాలు వేధిస్తున్నాయి. విశాఖ కోడేరు దాకా బైపాస్‌ పొడిగించాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. మహానేత హయాంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు నాలుగు వంతెనలు కట్టారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఒక్క బ్రిడ్జి కూడా కట్టలేదు. కనీసం అప్రోచ్‌రోడ్లు వేయించలేదు. 
– తుందూరు కథ మీ అందరికి తెలిసిందే..దాదాపుగా 10 గ్రామాలు..40 వేల మంది జనం ఇక్కడ ఆక్వా పార్క్‌ వద్దని స్థానికులు వ్యతిరేకించారు. పైప్‌లైన్‌ ద్వారా వ్యర్థాలను మా భూముల నుంచి తీసుకెళ్లవద్దని అంటే..30 కేసులు పెట్టారు. సత్యవతి అనే అక్కను 40 రోజులు జైల్లో పెట్టారు. 60 మందిపై కేసులు నమోదు చేశారు. ఇదే పరిస్థితిపై తుందూరుకు వెళ్లి రెండు సార్లు స్థానికులతో మాట్లాడాను. అక్కడి నుంచి ఆక్వా పార్క్‌ను తొలగించి సముద్రం వద్దకు సిఫ్ట్‌ చేస్తామని హామీ ఇస్తున్నాను.
– గోదావరి జిల్లా అంటే వరికి మారుపేరు. ఇవాళ వరి క్వింటాల్‌ రూ.1200లకు కొనుగోలు చేసే నాథుడు లేడు.
– ఆక్వాకు ప్రసిద్ధి చెందిన ఈ జిల్లాను పట్టించుకోవడం లేదు. ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదు. క్వాలిటీ సీడ్‌ లేదు. ల్యాబ్‌లు లేవు. పీసీఆర్‌ టెస్టులు జరగడం లేదు. ప్రభుత్వ ల్యాబులను దగ్గరుండి ప్రభుత్వమే మూత వేయిస్తోంది. ఆక్వా పంట చేతికి వచ్చే సరికి దళారులంతా ఒక్కటై రేటు తగ్గిస్తున్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– కరెంటు చార్జీలు చూసి దివంగత ముఖ్యమంత్రి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇవాళ యూనిట్‌ కరెంటు రూ.3.85 పైసలు ఉందని చెబుతున్నారు. ఆక్వా రంగంలో రైతులకు తోడుగా ఉండేందుకు కోల్డు స్టోరేజీలు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాలి. ఇవేవి ఈ ప్రభుత్వం లేదు.
– ఎన్నికలు వచ్చేసరికి మాత్రం చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు. అప్పుడు చంద్రబాబుకు గుర్తుకు వస్తుంది. వైయస్‌ జగన్‌ ఆక్వారంగంపై ప్రశ్నిస్తే అప్పుడు చంద్రబాబుకు కరెంటు వెలుగుతుంది. అంతవరకు ఆయనకు ఫ్యూజు వెలగదు. ఎన్నికలు వస్తున్నాయని కరెంటు చార్జీలు తగ్గిస్తారట. కేవలం రూ. 2 తగ్గిస్తారట. అది కూడా వైయస్‌ జగన్‌ రూ.1.50 కు కరెంటు ఇస్తానని ప్రకటించినప్పుడు ఆయన స్పందిస్తారు. మనందరి ప్రభుత్వం వచ్చాక కరెంటు రేటు రూ.1.50 చేస్తాను. ఐదేళ్లు అదే చార్జీలు కొనసాగుతాయి. నా పాలన 30 ఏళ్లు సాగితే అదే చార్జీలు కొనసాగుతాయి.
– ఆక్వా రంగంలో మాత్రమే ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఐస్‌ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.5 లకే కరెంటు ఇస్తాను. ఆక్వా రంగంపై ఆధారపడి అవస్థలు పడుతున్న రైతులకు తోడుగా ఉంటాను. దళారీ వ్యవస్థను నిర్మూలనం చేస్తాను. ఉక్కుపాదం మోపుతాను. ఈ ఆక్వా రంగం బాగుపడాలంటే ప్రోడక్షన్‌కు తగ్గట్టుగా కోల్డు స్టోరేజీలు రావాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు సముద్ర తీరంలో ఏర్పాటు చేసి, నాలుగో ఏటా మద్దతు ధర ఏర్పాటు చేస్తాం.
– రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందో ఆలోచన చేయండి. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసాలు చేసేవాడు మీకు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడు కావాలా? చంద్రబాబు నాలుగేళ్ల పాలన గమనిస్తే..అబద్ధాలు, మోసాలు, అవినీతి విచ్చలవిడిగా సాగుతుంది. మట్టి, ఇసుక, బొగ్గు, మద్యం, భూములు ఇలా ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోంది. చివరకు గుడిలో నగలను కూడా దోచేస్తున్నారు. పైన ఈ స్థాయిలో చంద్రబాబు దోచేస్తున్నారు. కింద జన్మభూమి కమిటీ పేరుతో దోచుకోండి అని మాఫియాను తయారు చేశారు. ఇంతటి దారుణంగా పాలన సాగుతోంది. ఒక్కసారి ఆలోచన చేయండి. 
– ప్రతి వర్గాన్ని, కులాన్ని చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి మోసం చేశారు. టీడీపీ వెబ్‌సైట్లోకి వెళ్లి చూస్తే ఎక్కడా కూడా వారి మేనిఫెస్టో కనిపించదు. ఎక్కడ కొడతారో అన్న భయం చంద్రబాబులో ఉంది. ఎన్నికల ప్రణాళిక వెతికినా కూడా దొరకదు.
– ఈ రోజు చంద్రబాబు మహానాడు ప్రారంభించారు. మహానాడు అంటే ఎన్‌టీ రామారావు పుట్టిన రోజుకు మహానాడు పేరు పెట్టి దాన్ని వేడుకగా చేస్తున్నారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఈ చంద్రబాబే. ఆయన కుర్చీ లాక్కుంది ఈయనే. ఆయన ఇల్లు, ట్రాస్ట్‌ లాక్కుంది..చివరకు ఆయన చావుకు కారణం కూడా ఈ చంద్రబాబే. ఇలాంటి వ్యక్తి ఎన్‌టీఆర్‌ బొమ్మకు దండేస్తుంటే ఈయన్ను ఏమనాలో? ఈయన మహానాడులో కూర్చోని మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేశారని అంటున్నారు. ఇదే మనిషి తెలంగాణకు వెళ్లి నా వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతారు. ఇక్కడికి వచ్చి రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని ముసలికన్నీరు గార్చుతున్నారు. ఈయన నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశారు. అప్పుడు చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకే రాదు. ఎన్నికలప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారు. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం మనం ధర్నాలు, దీక్షలు చేస్తే దగ్గరుండి నిర్వీర్యం చేశారు. బీజేపీతో విడాకులు ఇచ్చిన తరువాత కొత్త పెళ్లి కూతురును వెతుకునే సమయంలో ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుంది. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వారితో పాటు టీడీపీ ఎంపీలు కూర్చుని వుంటే హోదావచ్చేది కాదా? ఈ రోజు మాత్రం ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు ఫోజులు కొడతారు. ఒక్క పూట నిరాహార దీక్షట. ఆయన పుట్టిన రోజు..అదికూడా ఏప్రిల్‌ 20న ఆయన దీక్ష చేశారట. చంద్రబాబువన్నీ 420 బుద్ధులే. ఒక్కపూట నిరాహారదీక్షకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు నైజం చూసినప్పుడు నాకు  ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒక సిపాయి యుద్ధానికి బయలుదేరినప్పుడు తుపాయి  చంకన పెట్టుకొని వెళ్తారు. శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు ఆ సిపాయి తుపాయి పేల్చినప్పుడు గుండు బయటకు రాకపోతే ఫలితం ఏముంటుంది. వైయస్‌ జగన్‌ అనే సిపాయి తుపాయి పేల్చినప్పుడు ఐదు గుండ్లు మాత్రమే(5 మంది ఎంపీలు రాజీనామా చేశారు) బయటకు వచ్చాయి. మిగిలిన 20 గుండ్లు కూడావచ్చి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది. 
– ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి. రైతుల రుణాలు బేషరత్తుగా పోవాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికలు అయిపోయాయి..రైతులను పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. చంద్రబాబు పాలనలో కన్నీరుపెట్టని అక్కచెల్లెమ్మలు లేరు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. చదువుకున్న పిల్లలను వదిలిపెట్టలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామని ఇంటింటికి లెటర్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు 48 నెలలు అయ్యింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇన్నిన్ని మోసాలు చేసే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే..ఈయన చేసే మోసాలకు అడ్డుఅదుపు ఉండదు. ఇలాంటి వ్యక్తిని క్షమిస్తే రాజకీయ వ్యవస్థలో మార్పు ఉండదు. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి.
– చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..రేపొద్దున చిన్న చిన్న అబద్ధాలు చెబితే నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు. రేపొద్దున ఎన్నికల్లో చంద్రబాబు మైక్‌ పట్టుకొని ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? . కేజీ బంగారానికి బోనస్‌ ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మురు కాబట్టి..ప్రతి ఇంటికి చంద్రబాబు తన మనిషిని పంపిస్తాడు . ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతాడు. డబ్బులిస్తే మాత్రం వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి తీసుకున్నదే. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపేయండి.
– మనందరి ప్రభుత్వంవచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. ప్రతి రైతు ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఇందులోని ప్రతి అంశాన్ని ఒకే మీటింగ్‌లో చెప్పడం సాధ్యం కాదు. ఈ మీటింగ్‌లో పేదల చదువుల కోసం మనం ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను.
– ఇవాళ నిజంగా మన పిల్లలను మనం ఇంజినీర్లుగా, డాక్టర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా? కారణం ఏంటంటే..ఇంజినీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేది రూ.30 వేలు మాత్రమే. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు. ఆ పేదవాడు తన బిడ్డలను చదివించేందుకు ప్రతి ఏటా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో మన పిల్లలను ఇంజినీరింగ్‌ చదివించగలమా? ఒక్కసారి నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే తన పిల్లలను బాగా చదివిస్తేనే సాధ్యమని వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడు అనేవారు. నాన్నగారి పాలనలో ప్రతి పేదవాడికి తోడుగా ఉండేవారు. మీరు ఏం చదువుతారో చదవండి..నేను చదివిస్తానని నాన్నగారు తోడుగా ఉండేవారు. మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక పేదవాడి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ పాలకులకు పేదవారిపై ప్రేమ లేదు. ఈ పరిస్థితిని మార్చుతాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తాను. అంతేకాదు మీ పిల్లలను  ఇంజినీర్లుగా చదివించడమే కాదు..వాళ్లు హాస్టల్‌లో ఉండేందుకు అయ్యే ఖర్చులకు రూ.20 వేలు ప్రతి ఏటా చెల్లిస్తాను. చిట్టి పిల్లలను బడికి పంపిస్తే వైయస్‌ఆర్‌ అమ్మ ఒడి పథకం కింద తల్లి ఖాతాలో ప్రతి ఏటా రూ.15 వేలు జమా చేస్తాను. నవరత్నాల్లోని మిగిలిన అంశాలను జరుగబోయే మీటింగ్‌లో చెబుతాను. ఇందులో ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగానిలవమని  పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా..



 

తాజా వీడియోలు

Back to Top