26 నుంచి బూత్‌ కన్వీనర్ల సమావేశాలు

హైదరాబాద్‌: దశల వారీగా పోలింగ్‌ బూత్‌ కన్వీనర్ల సమావేశాలు నిర్వహించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి మే 10 వరకు జిల్లాల్లో మండలాల వారీగా బూత్‌ కన్వీనర్ల సమావేశాలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఈ సమావేశాలకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. నియోజకవర్గ సమన్వయకర్తలు తరచూ పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లను కలవాలని.. కింది స్థాయిలో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించింది. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించేలా బూత్‌ కన్వీనర్లకు తగు సూచనలివ్వాలని సూచించింది.  
Back to Top