20 నుంచి వైయస్‌ఆర్‌సీపీ పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లకు శిక్షణ

 
అమరావతి: ఈ నెల 20వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోలింగ్‌ బూత్‌ స్థాయి కన్వీనర్లకు శిక్షణా తరగతులు  నిర్వహించనున్నారు. ఈ శిక్షణతరగతులకు జిల్లాల వారీగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. నియోజకవర్గానికి ఒక రోజు ఈ శిక్షణా తరగతులు జరిగేలా పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు చర్యలు తీసుకుంటారు. ఏఏ తేదీల్లో ఎక్కడెక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తారో ..ఆయా వివరాలను ఈ నెల 19వ తేదీ లోగా కేంద్ర కార్యాలయానికి పంపించాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సర్క్యులర్‌ జారీ చేశారు.
 
Back to Top