4న సబ్బవరంలో పార్టీ ప్లీనరీ

విశాఖ‌: ఈ నెల 4న‌ పెందుర్తి నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు పార్టీ సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారంలో ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 5న పెందుర్తిలో నిర్వహించాలని భావించిన అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని నాలుగో తేదికి మార్పు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్లీన‌రీకి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, పార్టీ ముఖ్యనేత విజయ సాయి రెడ్డి, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమర్‌నాద్, పార్టీ ముఖ్య నేత గుడివాడ గురుమూర్తిరెడ్డి, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంద సంస్దల నాయకులు, బూత్‌ కమిటీల సభ్యులు, పార్టీ అభిమానులు, మహిళ కార్యకర్తలు పాల్గొని ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Back to Top