పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని 2019లో అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు నిర్విరామ కృషి చేయాలని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అధ్యక్షతన జరిగిన  నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ మేకపాటిలు, సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కాకాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లు పూర్తయినా నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఆయన చేసింది శూన్యమన్నారు. దాచుకోవడం.. దోచుకోవడం తప్పా..ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయాడన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top