నేటి నుంచి రచ్చబండ, పల్లెనిద్ర

-  ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహణ
- ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా 
అమరావతి:  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు నేటి నుంచి పార్టీ మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నవంబర్‌ 11 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల అధ్య‌క్షుల నేతృత్వంలో నియోజకవర్గ సమన్వకర్తలు,  ఎమ్మెల్యేలు, మండ‌ల సమన్వయకర్తలు శుక్రవారం  సమావేశమై కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సింది ఉంటుంది. తొలుత గ్రామాల్లోకి వెళ్లి అక్కడ పార్టీ జెండా అవిష్కరించి వైయ‌స్ఆర్‌  విగ్రహానికి నివాళులర్పిస్తారు. తరువాత రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వివరించి స్లిప్‌లలో వారితో సంతకాలు సేకరిస్తారు. అనంతరం బూత్‌ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారు. గ్రామంలో ప్రభావితం చేసే ఉద్యోగులు, కుల సంఘాల నేతలను కలుస్తారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తారు. మధ్యలో నియోజకవర్గ స్థాయిలోని విద్యాసంస్థ విద్యార్దులతో సమావేశమవుతారు. 


ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడ‌మే ల‌క్ష్యం 
రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల‌ని పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలను గ్రామాల్లోకి వెళ్లి పల్లెనిద్ర, రచ్చబండ ద్వారా కలుసుకోవాలని సూచించారు. ప్రజలు సమస్యలపై బ్లూప్రింట్‌ తయారు చేసుకోవాలని వివ‌రించారు. ప్ర‌తి ఊర్లో పార్టీ జెండా రెపరెపలాడాన్నారు.   
 


 
 
Back to Top