వైఎస్సార్ కు ఘన నివాళి..!

హైద‌రాబాద్‌: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరవ వర్థంతి కార్యక్రమం..హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు,  నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పంజాగుట్ట చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు ...అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆతర్వాత అసెంబ్లీకి వెళ్లారు.

ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటు రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపిస్తోందని  అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన‌ హామీలన్నీ అమలు చేసిన ఘనత మహానేత వైఎస్ దే అన్నారు. పేద ప్రజలకు మేలు చేకూరేలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతికుటుంబంలో సభ్యుడిగా నిలిచారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ లాంజ్ లో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచాలని ఉమ్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Back to Top