నియోజకవర్గాల్లో వైయస్ ఆర్ సీపీ పాదయాత్రలు

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర సోమవారం నాడు 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని
చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రోజుల పాటు సంఘీభావ
పాదయాత్రలు చేపడుతున్నారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ పాదయాత్రలను
నిర్వహించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రల్లో నాలుగేళ్లుగా
టిడిపి ప్రభుత్వ  వైఫల్యాలు,  ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 పైగా హామీల్లో కనీసం
10 శాతం కూడా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించనున్నారు. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి
చేసిన, చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు.  ఈ నెల 16 వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల
ముందు వంచన పై గర్జన పేరుతో నిరసనలు నిర్వహించి, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలను
సమర్పించనున్నారు. 

Back to Top