రేపు వైయస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

సత్తెనపల్లి:పట్టణంలోని పార్కు ఏరియాలో నూతనంగా నిర్మించిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కార్యాలయం బుధవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది. పార్టీ కార్యాలయ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మంగళవారం తెలిపారు. ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ, వైయ‌స్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, నరసరావుపేట, మాచర్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, పార్టీ గురజాల, వినుకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా.బ్రహ్మనాయుడులు హాజరు కానున్న‌ట్లు చెప్పారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల నుంచి వైయ‌స్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు త‌ర‌లిరావాల‌ని అంబ‌టి సూచించారు.

Back to Top