ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

గుంటూరుః
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని వైఎస్సార్సీపీ ఘనంగా నిర్వహించింది.
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ ఎస్సీ సెల్
అధ్యక్షులు మేరగ నాగార్జున ఆధ్వర్యంలో గుంటూరులో రాజ్యాంగ ఆమోదం పొందిన
నవంబర్ 26ను పండుగలా నిర్వహించారు. నెల్లూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


గుంటూరు నగరంలోని అంబేద్కర్ స్టాట్యూ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ..విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.  అనంతరం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈకార్యక్రమానికి
13 జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు సహా అన్ని వర్గాల
ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 10 గంటలకు లాడ్జి సెంటర్ సెంటర్‌లో ఉన్న
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొన్నారు. అక్కడి నుంచి
వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం వరకు భారీ ప్రదర్శనగా వెళ్లారు. 

పార్టీ
ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని నేతలు
తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఏ నాయకుడు చేయని విధంగా రాజ్యాంగ ఆమోద
దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు తమ అధినేత వైఎస్ జగన్‌
పిలుపునిచ్చారని చెప్పారు. 
Back to Top