ఆస్టిన్ లో వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలువైఎస్సార్సీపీ యూఎస్ ఎ ఎన్ ఆర్ ఐ విభాగం పథ నిర్దేశకత్వంలో పార్టీ అభిమానులు, అనుసరులు అమెరికాలో పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆస్టిన్ నగరంలోసాయి మందిర్ ఆడిటోరియంలో అన్న దానం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని దఫ దఫాలుగా సాగిస్తున్న సేవ కార్యక్రమాల్లో భాగంగా వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేతకు నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా 300 మంది అనాథలకు భోజనాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు నియోజక వర్గం వైాఎస్సార్సీపీ కన్వీనర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమల శెట్టి సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుబ్బారెడ్డి చింతగుంట, నారాయణ రెడ్డి గండ్ర అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నామాల, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, రఘు సిద్దపురెడ్డి, ప్రవర్ధన్ చిముల, ప్రదీప్ రెడ్డి చౌటి, కొండారెడ్డి ద్వర్శల, కుమార్ అశ్వపతి, సచ్చిముట్లూరు, మోహన్ రెడ్డి, రామ హనుమంత రెడ్డి మల్లిరెడ్డి, హేమంత్ బళ్ల, వెంకట్ వీరగుండి, శ్రీని చింత, వెంకట్ గౌతమ్, దేవేందర్ రెడ్డి, అశోక గుడూరు, శ్రీధర్ రెడ్డి వాసపల్లి, మల్లిక్ ఆవుల, మోహన్ రెడ్డి ఆరేకూటి, రవి నక్కల, ప్రదీప్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి, ప్రకాష్ రామమూర్తి, శ్రీనివాస్ బూసా, రేవంత్ కుమార్ అంగడి  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి, కాకినాడ నియోజక వర్గ కన్వీనర్ సునీల్ చలమలశెట్టి మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు అందించిన సేవల్ని గుర్తు చేసుకొన్నారు. అట్టడుగు వర్గా్ల్ని ప్రగతిపథంలోకి తీసుకొని వచ్చేందుకు వైఎస్సార్ చేసిన క్రషిని వివరించారు. ఎన్ ఆర్ ఐ విభాగం ద్వారా వైఎస్సార్సపీ సోషల్ మీడియా ప్రచారాన్ని విస్తారం చేయాలని అభిలషించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద తెలుగుదేశం జల్లుతున్న బురదను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. వెంకట్ నామాల కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. 


Back to Top