వైయస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఉదారత

దేశం కాని దేశంలో వైయస్సార్సీపీ ఎన్ ఆర్ ఐ వింగ్ అందిస్తున్న సేవలకు ఇది మరో ఉదాహరణ. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం బోరిరెడ్డి గారి పల్లికి చెందిన అమల దేసి రెడ్డి ( 41 ) కు భర్త చనిపోవడం తో తన ఒక్కగాని ఒక కూతురు ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎడారి దేశం అయిన కువైట్ లో 4 సంలుగా  ఇంటి పనిచేస్తూఉన్నది.  కొన్ని కారణాలతో అనారోగ్యానికి పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మరణించారు.  ఆమె మృత దేహాన్ని ఇండియా పంపాలని చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి దృష్టికి వెళ్లగా... వెంటనే స్పందించి వెల్ఫేర్ సభ్యుడు దుగ్గి గంగాధర్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు యం. చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని భారత రాయబార కార్యాలయం ద్వారా టికెట్ కూడా ఇప్పించడం జరిగింది.  చెన్నై నుండి స్వస్ధలం మృత దేహాంను తరలించేందుకు ఉచితంగా అంబులెన్స్ యువనేత రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారు ఏర్పాటు చేశారని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ సందర్భముగా ఇలియాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎన్నికల సమయములో గల్ప్ భాదితులను ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ,తను ఇచ్చిన ఇతర హామీల వలె ఈ హామీని కూడా గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. కువైట్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి కి దృష్టికి వచ్చిన తెలుగు వారి సమస్యలను పరిష్కరించడం అభినందనీయమని. సహకరించిన నాయకులందరికీ పార్టీ తరపున కృతఙ్ఞతలు తెలిపారు, కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు యన్. మహేశ్వర్ రెడ్డి, యం. చంద్రశేఖర్ రెడ్డి, రమణ యాదవ్, సభ్యులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గడికోట రాజా, దుగ్గి గంగాధర్, జి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ గఫార్, ఎస్. సజ్జాద్, మరియు బత్తిన శివారెడ్డి, సి. చంద్రశేఖర్ రెడ్డి, యం. వి. సుబ్బారెడ్డి, కడప శీను, కె. వాసు తదిరులు అమల మృతదేహాన్ని  సందర్శించి ఘనంగా నివాళిలు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ మృత దేహంతో పాటు వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం ఒన్ మాధవరం మహిళ వారలక్షమ్మ రాయని మృతదేహం కూడా పంపించటం జరిగింది. వారలక్షమ్మ మృతదేహాన్ని స్వస్ధలం చేర్పించేందుకు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు

Back to Top