మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో పోటీ వద్దు

హైదరాబాద్‌: ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో బాధిత కుటుంబం బరిలో ఉంటే పోటీ పెట్టకూడదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక చోట్ల  ఉప ఎన్నికలు జరుగుతున్న కౌన్సిలర్, కార్పొరేటర్‌ స్థానాల్లో అంతకు ముందు ప్రాతినిధ్యం వహిస్తూ మరణించిన ప్రత్యర్థి రాజకీయ పక్షాలవారి సీట్లకు వారి కుటుంబ సభ్యులే బరిలో దిగిన పక్షంలో పోటి పెట్టకూడదని వైయస్‌ఆర్‌సీపీ తీర్మానించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటనలో తెలిపారు.

Back to Top