స్పీకర్ కోడెల మీద అవిశ్వాసమే..!

అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్) అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ శాసనసభ పక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో శాసనసభ్యుల టీమ్ నోటీసును అసెంబ్లీలోని కార్యదర్శి సత్యనారాయణ కు అందచేసింది. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు సుజయ క్రిష్ణ రంగారావు మీడియాతో మాట్లాడారు.

చాలా దుర‌ద్రుష్ట ప‌రిస్థితిల్లో స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని, స్పీక‌ర్‌గా కోడెల ఏక‌గ్రీవంగా ఎంపిక‌య్యేందుకు వైఎస్ జ‌గ‌న్ స‌హ‌క‌రించారని గుర్తు చేశారు.  తొలి స‌మావేశం నుంచి కూడా అధికార పార్టీకి అండ‌గా నిలిచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం గొంతునొక్కారు. స‌భాప‌తి నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాలి. కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర‌తిప‌క్షాన్ని దూషిస్తుంటే స్పీక‌ర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని రంగారావు గుర్తు చేశారు.

 

‘‘ స్పీక‌ర్ తీరు బాగోలేద‌ని ఇంత‌కుముందే అవిశ్వాస తీర్మానం పెట్టాం. అయితే ఆయ‌న తీరు మార్చుకుంటారని భావించి అప్ప‌ట్లో నోటిస్ వెనక్కి తీసుకున్నాం. అయితే మా ఎమ్మెల్యె రోజాపై మంత్రి తప్పుడు రూల్‌ కోట్ చేస్తే..స్పీక‌ర్ కూడా అదే రూల్‌ను కోట్ చేసి ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. మీ నిర్ణ‌యం  మార్చుకోవాల‌ని మేం కోరితే ప‌ట్టించుకోలేదు. అందుకే స‌భ నుంచి బాయ్‌కాట్ చేశాం.’’ అని రంగారావు వివరించారు.


ఇదంతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేయటమే అని సుజయ్ క్రిష్ణ రంగారావు విశ్లేషించారు. అధికారపక్షం నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నా, అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడ్ని దూషిస్తున్నా ఆపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదని గుర్తు చేశారు. దీంతో పాటు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు అంటూ కొన్ని వీడియోలు లీక్ చేశారని, ఇది స్పీకర్ కు తెలియకుండా ఎలా జరిగిందని నిలదీశారు.

 

 ‘‘ టెలీకాస్ట్ చేయ‌ని వీడియోలు సోషియ‌ల్ మీడియాలో ప్ర‌చారం అయ్యాయి. పూర్తి వీడియో ప్ర‌సారం చేసింటే బాగుంటుంది. అదికాకుండా ఎడిట్ చేసిన క్లిప్పింగులు సోషియ‌ల్ మీడియాకు అంద‌జేస్తున్నారు. పూర్తి ప్రొసీడింగ్స్ కాకుండా కొంత మేర మాత్రమే మైక్స్ పెట్టి మరీ బయటకు ఇస్తున్నారు. దీనిపై స‌మాదానం చెప్పాలి. ’’ అని రంగారావు డిమాండ్ చేశారు.

 

దీని మీద నిబంధనల ప్రకారం 14 రోజుల లోగా నిర్ణయం తీసుకొని సభను సమావేశ పరచాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.


Back to Top