హైదరాబాద్ః ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
అమ్జద్ బాషా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా అన్నారు. వందలాది ఉచిత హామీలు గుప్పించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. రైతులకు వ్యవసాయ రుణాలు ఎక్కడ మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆపథకమే లేదని మంత్రి చెబుతుండడం దుర్మార్గమని అమ్జద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతుందని అమ్జద్ బాషా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ధనార్జనే ధ్యేయంగాకుంభకోణాలకు పాల్పడుతున్నారు. రాజధానిలో రైతులను మోసం చేసి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రజల విశ్వాసం కోల్పోయినందునే టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని అమ్జద్ బాషా తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
చాంద్ బాషాప్రజాసమస్యలు పక్కనబెట్టి ఏవిధంగా దోచుకోవాలి, దాచుకోవాలన్న దానిమీదనే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా నిప్పులు చెరిగారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం..ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వ బాధ్యతను తెలియజెప్పేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు చెప్పారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రబుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాకు వచ్చినప్పుడు వేరుశనగ రైతులను ఆదుకుంటామని చెప్పారని, హెక్టారుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి....నివేదికలో అనంతపురం జిల్లా పేరు చేర్చకపోవడం దారుణమన్నారు. జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా వైఫల్యం చెందినందునే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నామన్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిభారతదేశంలోనే ఇంత దుర్మార్గమైన అనైతిక పాలన ఎక్కడా లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. అదీ చేస్తాం, ఇదీ చేస్తామంటూ ప్రజలను నమ్మించి నిండా ముంచారని ఫైరయ్యారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరినీ చంద్రబాబు మోసం చేశారని చెవిరెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అందరి నోట్లో మట్టి కొట్టాడన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు చెవిరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజల కోరిక తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రభుత్వానికివ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారన్నారు. అదేవిధంగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని చెవిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్నారు.
సుజయకృష్ణఅధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలిపారు. ప్రభుత్వ విధానంపై ఏమాత్రం సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వానికి వ్యతేరికంగా అవిశ్వాస తీర్మానంలో వారు కూడా ఓటేస్తారని చెప్పారు.ఇక టీడీపీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని సుజయకృష్ణ తెలిపారు. వారు ఏవిధంగా వ్యవహరిస్తారన్నది అవిశ్వాసంలో తేలిపోతుందన్నారు.
కొరుముట్ల శ్రీనివాసులు..ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ అవినీతికి పాల్పడిందిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిన...చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు కొరుముట్ల మీడియాకు వివరించారు.