వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిజ‌మైన అభివృద్ధి

నంద్యాలవిద్య: నంద్యాలలో నిజమైన అభివృద్ధి జరగాలంటే వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ను గెలిపించాలని పూతలపట్టు ఎమ్మెల్యే సునిల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం 33వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నంద్యాలలో ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నామమాత్రంగా ఉన్నాయని ఆరోపించారు. నంద్యాల ప్రజలు సౌమ్యుడైన శిల్పామోహన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేయాలని వార్డు ప్రజలను కోరారు. వీరి వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణ, రామచంద్రుడు, కృష్ణారెడ్డి, రాజారాం, ప్రసాద్, నాగరాజు, ప్రశాంత్, సుధాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top