వైయస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా నక్కా వెంకటేశ్వరరావు

వెంకటగిరి : వైయస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడుగా  పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నక్కా వెంకటేశ్వరరావును నియమించారు.  నక్కా వెంకటేశ్వరరావు చేనేత సహకార సంఘం అధ్యక్షుడుగా, పద్మశాలీ సహకార సంఘం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర పద్మశాలీసాధికార సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ...నేడు వస్త్రవ్యాపారంలో పోటీని ఎదుర్కోని తనదైన ప్రత్యేకత గల పరిశ్రమ చేనేత రంగమని తెలిపారు. ఆ రంగంలో కార్మికుడు నుంచి వ్యాపారి వరకూ ఎదుర్కొనే సమస్యలపై ఉన్న అవగాహన కారణంగా వారితో మమేకం అయి వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ పార్టీ వేదికగా చేనేతలను ఐక్యం చేసేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.

Back to Top