వైయస్సార్సీపీ నూతన నియామకాలు

హైదరాబాద్ః అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ నూతన నియామకాలు చేపట్టంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా వైయస్సార్ జిల్లాకు చెందిన గుబ్బ చంద్రశేఖర్ ను నియమించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లాకు చెందిన సామినేని ఉదయభాను నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడకు చెందిన పైలా సోమినాయుడు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి రాజను పార్టీ నియమించింది.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర విభాగం అధ్యక్షునిగా వంగవీటి రాధాకృష్ణ నియమితులయ్యారు.  

Back to Top