వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఆయా పదవులకు సంబంధించిన నూతన నియామకాలను ప్రకటించింది. వివిధ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించడమైనది. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. 

తూర్పుగోదావరి జిల్లా ..
ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ముత్యాల శ్రీనివాస్, అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపె విశ్వరూప్, రాజమండ్రి సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా రౌతు సూర్యప్రకాశ్ రావు, ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయకర్తయిన గుత్తుల సాయితో పాటు పితాని బాలకృష్ణను నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించడమైనది. 

పశ్చిమగోదావరి జిల్లా..
పాలకొల్లు నియోజకవర్గ సమన్వయ కర్త అయిన మేకా శేషుబాబుతో పాటు గున్నం నాగబాబును అదనపు సమన్వయకర్తలుగా నియమించడమైనది. 

కృష్ణా జిల్లా..
విజయవాడ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ ను నియమించారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా కార్పొరేటర్ బొప్పన బావకుమార్ ను నియమితులయ్యారు. 

ప్రకాశం జిల్లా..
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఇల్లూరి వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. 

నెల్లూరు జిల్లా..
గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మేరిగ మురళీధర్ నియమితులయ్యారు. 

కర్నూలు జిల్లా..
ఆళ్లగడ్ల నియోజకవర్గ సమన్వయకర్తగా డా. రామలింగారెడ్డి,  శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్తగా బుడ్డా శేషురెడ్డి నియమితులయ్యారు. 

Back to Top