వైయస్‌ఆర్‌సీపీ నేతలే టార్గెట్‌గా దాడులు

నంద్యాల: అధికారం అండగా ఉందని టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే టార్గెట్‌గా పోలీసులతో దాడులు చేయిస్తున్నారని నంద్యాల ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాత్రి నంద్యాల లార్జీలలో పోలీసులతో దాడులు నిర్వహించడాన్ని  మోహన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శిల్పా మీడియాతో  మాట్లాడుతూ..టీడీపీ ప్రలోభాలకు లొంగలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల నాయకులు, కౌన్సిలర్ల ఇళ్లపై అర్థరాత్రి వేళలో దాడులు నిర్వహించి భయాందోళనకు గురి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇళ్లలో మరణాయుధాలు ఉన్నాయని ఇప్పటికే ముగ్గురు కౌన్సిలర్లౖ ఇళ్లలో సోదాలు చేశారని తప్పుపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు సుబ్బారాయుడు, మురళి, అమృతరాజు ముగ్గురిని టార్గెట్‌ చేసుకొని దాడులకు పాల్పడటం Ôశోచనీయమన్నారు. నిన్న రాత్రి లాడ్జిల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ నేతలే టార్గెట్‌గా దాడులు చేçశారని ఫైర్‌ అయ్యారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు అరాచకాలకు అంతులేకుండా పోయిందని, డబ్బులు ఎరగా చూపుతున్నారని ఆరోపించారు. ఈ నెల 3న పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాలకు వస్తున్నారని శిల్పా మోహన్‌ రెడ్డి తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. తాము నిర్వహిస్తున్న ప్రచారంలో జనం బ్రహ్మరథం పడుతున్నారని, ఉప ఎన్నికలో విజయం తమదే అని శిల్పా మోహన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top