వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లే టార్గెట్‌ అర్ధ‌రాత్రి ఇళ్ల‌లో సోదాలు

నంద్యాల: ఉప ఎన్నిక‌లో గెలిచేందుకు అధికార పార్టీ అడ్డ‌దారులు తొక్కుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లే టార్గెట్‌గా పోలీసుల‌తో దాడులు చేయిస్తూ భ‌య‌పెట్టే కార్య‌క్ర‌మాల‌కు తెర లేపారు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌పై బెదిరింపుల ప‌ర్వాన్ని టీడీపీ కొన‌సాగిస్తోంది. పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది వైయ‌స్‌ఆర్‌సీపీ నేతల ఇళ్ల‌లో అర్ధ‌రాత్రులు దాడులు నిర్వ‌హించి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నంద్యాల ప‌ట్ట‌ణంలోని వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి శిల్పా మోహన్‌ రెడ్డి బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. శిల్పా బంధువులు జగదీశ్వర్‌ రెడ్డి, ఆదిరెడ్డి ఇళ్లలో, ఆయన మద్దతుదారులు ఆర్యవైశ్య నాయకుడు నెరవేటి సత్యనారాయణ, లింగారెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. పోలీసులు అర్థరాత్రి ఇళ్ల తలుపులు తట్టి సోదాలు నిర్వ‌హించారు. టీడీపీకి మంత్రులు, వారి మద్దతుదారులపై పోలీసులు దాడులు చేయడం లేదు. అధికార టీడీపీ వందల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నా పట్టించుకోవ‌డం లేదు.  ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే వేధింపుల పర్వం కొనసాగుతోంది.  టీడీపీ నేత‌ల తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ వేధింపులకు నంద్యాల ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చ‌రించారు. ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో విజయం వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top