23న నెల్లూరు రూర‌ల్ ప్లీన‌రీ

నెల్లూరుః నగర రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశం ఈ నెల 23వ తేదిన నిర్వ‌హించ‌నున్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. మ‌న రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి, ప్ర‌జా ఉద్య‌మానికి ఒక అర్థ‌వంత‌మైన చ‌ర్చా వేదిక ప్లీన‌రీ స‌మావేశం అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నెల 23వ తేదీన సీపీఆర్ క‌ల్యాణ‌మండ‌పంలో ఉద‌యం 9 గంట‌ల‌కు ప్లీన‌రీ స‌మావేశం ఉంటుంద‌న్నారు. ఈ స‌మావేశానికి ప్ర‌తి కార్య‌క‌ర్త‌, గ్రామక‌మిటీ స‌భ్యులు, స‌ర్పంచ్‌లు, డివిజ‌న్ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రుకావాల‌ని ఆయ‌న కోరారు.

Back to Top