చెముడుగుంటలో వైయస్‌ఆర్‌సీపి నవరత్నాల సభ

–నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కాకాణి...
వెంకటాచలం: వైయస్‌ఆర్‌సీపి సర్వేపల్లి నియోజకవర్గ నవరత్నాల సభ గురువారం మండలంలోని చెముడుగుంట స్రిడ్స్‌ కళ్యాణమండపంలో జరుగుతుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9.30గంటలకు నవరత్నాల సభ ప్రారంభమవుతుందని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపి అధికారంలోకి వచ్చేందుకు నవరత్నాలు లాంటి తొమ్మిది హామీలు బాటలు వేస్తాయని తెలియజేశారు.
దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలన సాధన కోసం కృషిచేస్తున్న వైయస్‌ఆర్‌సీపి అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో సీఎం చేసేందుకు ప్రతీ ఓక్కరూ కృషి చేయాలని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కీలకమైన బూత్‌ కమిటీల నియామకంపై నవరత్నాల సభలో చర్చిస్తామని తెలిపారు. ఈ నవరత్నాల సభకు నియోజకవర్గ పరిదిలోని ఐదు మండలాల నుంచి వైయస్‌ఆర్‌సీపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌ అభిమానులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Back to Top