నమ్మక ద్రోహం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య

చిత్తూరు: పిల్లనిచ్చిన ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడుకు నమ్మక ద్రోహం వెన్నతో పెట్టిన విద్య అని  వైఎస్సాఆర్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి అన్నారు.  కార్వేటినగరంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. నమ్మకద్రోహం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, పదవి కోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాడే ఇది లోకానికి తెలిసిందన్నారు.  రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జాన్యాలతో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని మండిపడ్డారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించకుండా అధిక సంతానాన్ని కనమని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవవగాహన రాహిత్యానికి ప్రతీక అని విమర్శించారు.

Back to Top