వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోవిందరెడ్డి

హైదరాబాద్: ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జూన్ ఒకటిన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిం చింది. ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో పార్టీకి దక్కే అవకాశమున్న ఒక్క స్థానానికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే దేవసాని చిన్న గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులతో చర్చించిన తరువాత అభ్యర్థి పేరును ఖరారు చేసినట్టు తెలిపారు.
 
పార్టీ ఆవిర్భావం నుంచి చురుకైన పాత్రే..
ఎంటెక్ పూర్తి చేసిన గోవిందరెడ్డి రోడ్డు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా 2001 వరకు పనిచేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన  ఆయన 2004-09 మధ్యకాలంలో బద్వేలు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీ లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో పార్టీ పరిశీలకునిగా పనిచేశారు.
Back to Top