వైయ‌స్ఆర్‌సీపీ ముంద‌డుగు
-  పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే రాజీనామాలు
- రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎంపీ ప‌ద‌వులు వ‌దులుకునేందుకు  సిద్ధ‌ప‌డ్డ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు 


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాటం చేస్తోన్న వైయ‌స్ఆర్‌సీపీ .. చివరి అస్త్రమైన రాజీనామాలపై ముందడుగువేసింది. పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే రాజీనామాలు చేస్తామన్నా ఆ పార్టీ ఎంపీలు బుధవారం రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్‌సభకు బయలుదేరారు. 

స్పీకర్‌ ఫార్మాట్‌లో ..
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎనిమిదో సారి ఇచ్చిన నోటీసులు నేడు సభ ముందుకు రానుంది. అయితే నోటీసులపై స్పీకర్‌ చర్చ చేపడతారా, లేదా అనేది తేలాల్సిఉంది. అవిశ్వాసాన్ని తప్పించుకునే క్రమంలో కేంద్రం.. ఏఐఏడీఎంకే ఎంపీల నిరసనలను సాకుగా చూపి పార్లమెంట్‌ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ముందస్తుగా స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖలను సిద్ధం చేశారు.  రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే థ్యేయంగా, అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఎంపీ ప‌ద‌వులు వ‌దులుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ముందుకు రావ‌డం అభినంద‌నీయం. వీరి మాదిరిగా రాష్ట్రానికి చెందిన మిగ‌తా ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌క వ‌స్తుంది. మ‌రి టీడీపీ ఎంపీలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో, లేక చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోతారో వేచి చూడాలి. ఇప్ప‌టికే పూట‌కో మాట మాట్లాడుతూ..ఊస‌ర‌వెళ్లి కంటే వేగంగా రంగులు మార్చిన చంద్ర‌బాబును ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుగేళ్లు మ‌భ్య‌పెట్టిన చంద్ర‌బాబును అన్ని పార్టీలు, ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లు త‌ప్పుప‌డుతున్నారు. ఆయ‌న హోదా కోసం పోరాటం చేస్తారో, లేదా కేసుల‌కు భ‌య‌ప‌డి పారిపోతారో చూడాలి.

Back to Top