కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం

ఢిల్లీలో కమ్యునిస్టుల ధర్నాకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు
చంద్రబాబు జేబులు నింపుకోవడానికి ప్యాకేజీ
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు తన జేబులు నింపుకోవడానికి ప్యాకేజీ ఉపయోగపడుతుందన్నారు. పోలవరంలో ముడుపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీని అంగీకరించిందన్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పోరాడుతామని, పార్లమెంట్‌ వేదికగా అనేక పోరాటాలు చేస్తామన్నారు. 
హోదాపై టీడీపీది రోజుకో మాట: ఎంపీ మిథున్‌రెడ్డి
ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ రోజుకో మాట మారుస్తుందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. హోదా సాధన కోసం ప్రజలంతా కలిసికట్టుగా రావాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చే విధంగా పోరాడుదామన్నారు. ఏప్రిల్‌ 6వ తేదీలోపు కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 
ఆంధ్రరాష్ట్రాన్ని ఏం చేయదలిచారు: సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఆంధ్రరాష్ట్రాన్ని ఏం చేయదలుగుచుకున్నారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చట్టంలోని అంశాలను నెవరేర్చడానికి ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బందేంటని ధ్వజమెత్తారు. ఆంధ్రరాష్ట్ర ప్రజానికం గొంతమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన అంశాలను నెరవేర్చాలని అడుగుతున్నామన్నారు. చంద్రబాబుకు ఉన్న బలహీనతలకు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టడం క్షమించరాని నేరమన్నారు. హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. 
Back to Top