హోదా కోసం ఎందాకైనా....వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిల రాజీనామాలకు ఆమోదం

 ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వర్తింప చేయడంలో
నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అయిదు మంది లోకసభ
సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్ ఆమోదించారు. రాజీనామాలను ఆమోదించడంలో జాప్యం
వద్దంటూ స్పీకర్ పై వత్తిడి తెచ్చి మరీ తమ నిబద్ధతను ఎంపిలు చాటుకున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే లోగా ప్రత్యేక హోదా వర్తింప చేయని పక్షంలో తమ
పదవులకు రాజీనామా చేస్తామని ఎంపిలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అటు తరువాత సమావేశాల్లో వరుసగా అనేక అవిశ్వాస తీర్మానం నోటీసులు అందచేయడంతోపాటు,  చివరి రోజున ఏప్రిల్ ఆరో తేదీన మేకపాటి రాజమోహన్
రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ లు స్పీకర్
కు రాజీనామాలు సమర్పించారు.  వీటిపై
స్పీకర్ వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం జూన్ 20 వ తేదీని నుంచి రాజీనామాలు
అమలులోకి వస్తాయని ప్రకటించారు.

ఈ రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా ఉద్యమం కొత్త
మలుపు తిరగనుంది. రాష్ట్ర  ప్రయోజనాలకు సంబంధించిన
 అంశంలో ఒకపార్టీకి చెందిన ఎంపీలందరూ
రాజీనామాలు చేసిన ఘట్టాలు లేవు. దీంతో ప్రత్యేక హోదా అంశం ఇకపై జాతీయ స్థాయిలో
చర్చనీయాంశం కానుంది. అంతే కాకుండా, ప్రత్యేక హాదా సాధనకు ఇకపై తామంతా ప్రజా క్షేత్రంలో
పోరాటం చేస్తామని రాజీమాలు చేసిన ఎంపిలు ప్రకటించారు. అవకాశ వాద రాజకీయాలతో యూటర్నులు
తీసుకుంటూ, ప్రత్యేక హోదా సాధనకు తూట్లు పొడిచిన టిడిపి , ఈ రాజీనామాలపై కూడా కువిమర్శలకు
పాల్పడుతోంది. రాజీనామాల ఆమోదానికి ఉప ఎన్నికలకు ముడిపెడుతూ డ్రామాలు చూస్తూ,
ప్రత్యేక హోదా సాధన పోరాట స్ఫూర్తిని దెబ్బతీసే లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

కాగా రాజీనామాలను ఆమోదింప చేసుకుని తాము తమ
చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని , రాబోయే రోజుల్లో హోదా సాధన ఉద్యమాన్ని మరింత
తీవ్రతరం చేస్తామని వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

హోదా కోసం  నిరంతర పోరు

అధ్యక్షులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి మార్గదర్శకంలో పార్టీ తీసుకున్న నిర్ణయానుసారంగా వైయస్ ఆర్ కాంగ్రెస్
ఎంపీలు పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడారు. ఆంధ్రుల హక్కు,
రాష్ట్రానికి సంజీవిని అయిన ప్రత్యేక హోదా డిమాండ్ పై తమ గళాన్ని గట్టిగా
వినిపిస్తూ జాతీయ స్థాయిలో హోరెత్తించారు. నిరసనలు
, ఆందోళనలు నిర్వహించడమే
కాకుండా పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశారు. జాతీయ
, ప్రాంతీయ పార్టీల నేతల
మద్దతు కూడగట్టారు. పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక
హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల న్యాయమైన హక్కు అంటూ గొంతెత్తి నినదించారు. ప్యాకేజీలతో
ప్రయోజనం శూన్యమని తేల్చిచెప్పారు.

అనువైన ప్రతి వేదికను
వినియోగించుకుంటూ, హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎదురులేదనుకుంటున్న
కేంద్రంలోనిబిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభపుత్వం పై  ఏకంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం
నోటీసు ఇచ్చారు. పార్టీ  ముఖ్యనేతలంతా
ఢిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. పార్టీ నిర్ణయం మేరకు ఏప్రిల్‌ 6న పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో
అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షలతో హోదా ఉద్యమాన్ని పతాక స్థాయికి
తీసుకెళ్లారు. ఎంపిలు రాజీనామాలు చేసిన
దాదాపు 74 రోజుల అనంతరం స్పీకర్  వాటిని ఆమోదిస్తున్నట్లుగా
బులెటిన్ విడుదల చేశారు. 



Back to Top