వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా ఆమోదం


న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామాలు ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గత పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నేతల ఆరోగ్యం విషమించడంతో ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఆమరణ దీక్షలను భగ్నం చేసిన సంగతి విధితమే. ఆ తరువాత లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. వాళ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలోనే లోక్‌సభ స్పీకర్‌ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాను ఆమోదించినట్లు సభలో ప్రకటించారు. కాగా, గత పార్లమెంట్‌ సమావేశాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పలుమార్లు ప్రత్యేక హోదాపై చర్చించాలని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతి సభలోనూ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోని స్పీకర్‌ ఇవాళ టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పది రోజుల్లో చర్చకు స్పీకర్‌ అనుమతించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది.
 
Back to Top