వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం


న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌ 6న వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైయస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు రాజీనామాలు చేశారు. అయితే రెండు నెలల తరువాత ఎట్టకేలకు వారి రాజీనామాలకు ఆమోదం తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరడంతో ఆమె ఆమోదం తెలిపారు.
 
Back to Top