గన్నవరం ఏయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు


విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎంపీలు గన్నవరం ఏయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి ఎంపీలు జగన్‌ వద్దకు బయలుదేరుతారు. ఈ నెల 6వ తేదీన ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, అవినాష్‌రెడ్డిలు ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ తరువాత వారి దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ పరిణామాలను వైయస్‌జగన్‌కు వివరించేందుకు ఎంపీలు విజయవాడకు వచ్చారు. గన్నవరం ఏయిర్‌పోర్టు నుంచి ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ వద్దకు ఎంపీలు వెళ్తారు.
 
Back to Top