పార్ల‌మెంట్‌లో నినాదాల హోరు


- వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల పోరాటానికి ప‌లువురు ఎంపీల మ‌ద్ద‌తు
ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్య‌మిస్తునే ఉంది. రెండోరోజు కూడా హస్తినలో పార్టీ ఎంపీలు ఆందోళ‌న కొన‌కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌ బయట, లోపల కూడా వైయ‌స్‌ఆర్‌ సీపీ  పోరాటాన్ని ఉధృతం చేసింది. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ఈ రోజు ఉదయం ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆయా పార్టీల ఎంపీలు మ‌ద్ద‌తు తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top