పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళన


ఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం పార్లమెంట్‌లో పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. లోక్‌సభ ప్రారంభం కాగానే వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఎంపీల నినాదాలతో లోక్‌సభ కొద్దిసేపటికే వాయిదా పడింది.
 
Back to Top