రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం



 
న్యూ ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం మేం చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సాయంత్రం స్పీకర్‌ను కలువబోతున్న ఎంపీలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..రాజీనామాలకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. జరగబోయే పరిణామాలకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు విన్యాసాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబు  ఇప్పుడేమో బీజేపీతో దోస్తీ కడుతున్నామని మాపై నిందలు వేయడం సరికాదన్నారు.  చంద్రబాబు, టీడీపీ మంత్రులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

మా రాజీనామాలు ఎందుకు ఆమోదించరు -  వైవీ సుబ్బారెడ్డి
25 రోజుల క్రితం ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే ఆమోదించనని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కర్ణాటకలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆమోదించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలం స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామాలు చేశామన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా అన్యాయం చేస్తుందో దానికి నిరసనగా మేం రాజీనామా చేశామన్నారు. రాజీనామాలు ఆమోదించకపోతే ఏపీ ప్రజలను అవమానించడమే అన్నారు.  రాజీనామాలు ఆమోదించాలి, లేదంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పీకర్‌ను కోరబోతున్నామన్నారు. 

హోదాతోనే రాష్ట్రాభివృద్ధి:  వరప్రసాద్‌
ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. మేం ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశామన్నారు. రాజీనామాల విషయంలో మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. రాజీనామాలు ఆమోదించకపోతే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. చంద్రబాబు నాలుగేళ్లు కేంద్రంతో కలిసి పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. ఏపీలో అవినీతి పెరిగి పోతుందన్నారు. కమీషన్ల కోసమే ప్రత్యేక ప్యాకేజీని ఆ నాడు చంద్రబాబు ఆహ్వానించారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రాజీనామాలు ఆమోదిస్తారని ఎదురుచూపు: మిథున్‌రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ఎంపీ పదవికి రాజీనామా చేశామని, ఇది గొప్ప నిర్ణయంగాభావిస్తున్నామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఎంత గట్టిగా ప్రత్యేక హోదా కోరుతున్నారో మా నిర్ణయంతో స్పష్టమైందన్నారు. రాజీనామాల ఆమోదం జరుగుతుందని మేమందరం ఎదురుచూస్తున్నామని చెప్పారు. 

మమ్మళ్లి దీవించండి: ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
 రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలం రాజీనామా చేశామని, వాటిని ఆమోదించుకొని ఏపీకి వస్తామని, మళ్లీ మమ్మల్ని ఆశీర్వదించాలని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. మా రాజీనామాలు ఆమోదించమని స్పీకర్‌ను కోరుతామని ఆయన వెల్లడించారు.
 

తాజా వీడియోలు

Back to Top