ఎంపీల దీక్షకు సీపీఐ మద్దతు

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎంపీల దీక్షకు బుధవారం సీపీఐ మద్దతు తెలిపారు. ఏపీ భవన్‌లో ఎంపీల దీక్షాస్థలిని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేశారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా పారిపోయిందన్నారు. ఇవాళ బీజేపీ మొసలి కన్నీరు కార్చుతుందన్నారు. ప్రభుత్వాల నియంతృత్వ పోకడలు సరికాదన్నారు. ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top