ఎంపీల‌ను ప‌రామ‌ర్శించనున్న వైయ‌స్ జ‌గ‌న్‌

- సాయంత్రం 7 గంట‌ల‌కు ఎంపీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌
అమ‌రావ‌తి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొక్కవోని సంకల్పంతో ముందుకుసాగుతోంది. ఐదుకోట్ల ఆంధ్రుల కోసం, విభజన హక్కుల సాధన కోసం అన్నపానాలు మరిచి.. ఎంపీలు ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి కొనసాగిస్తున్న దీక్ష మంగళవారం ఐదోరోజుకు చేరుకుంది.  ఐదు రోజులుగా దీక్షలో ఉండటంతో మిథున్‌, అవినాశ్‌ బాగా నీరసించిపోయారు. దీంతో ఎంపీల‌ను వైయస్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించ‌నున్నారు. గుంటూరు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ సాయంత్రం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఎంపీల‌తో మాట్లాడ‌నున్నారు. అలాగే ఆసుప‌త్రిలో ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌ల‌ను కూడా వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. 

Back to Top