కొనసాగుతున్న ఎంపీల దీక్ష


ఢిల్లీ:  ప్రత్యేక హోదాపై వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేసుంది. ఈ నెల 6వ తేదీ తమ పదవులకు రాజీనామా చేసి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు దిగారు. వీరిలో మేకపాటి, సుబ్బారెడ్డి, వరప్రసాద్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారు. వీరి ఆరోగ్యం కూడా క్షీణించింది. ఐదు రోజులుగా ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం బాధాకరం.    అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి శరీరంలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయి. అయినా దీక్షలు కొనసాగిస్తున్నారు.
 
Back to Top