అవిశ్వాస నోటీసుపై చర్చ జరపండి

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్‌లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌ను కోరారు. మంగళవారం వారు స్పీకర్‌ను కలిశారు. సభ సజావుగా లేదంటూ వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. చర్చ జరపాల్సిందే అని చేతులు జోడించి స్పీకర్‌ను వేడుకున్నట్లు, వాయిదా వేయవద్దని స్పీకర్‌ను కోరినట్లు ఎంపీలు పేర్కొన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ జేడీఎస్, అన్నా డీఎంకేలను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top