కాసేపట్లో స్పీకర్‌ను కలవనున్న ఎంపీలుఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడటంతో కాసేపట్లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ను కలవబోతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వారు తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసేందుకు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌ సిద్ధమయ్యారు. స్పీకర్‌  ఫార్మెట్‌లో రాజీనామాలు చేయనున్నారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వెళ్లి ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలు చేయనున్నారు.
 
Back to Top