నేడు రాష్ట్రపతిని క‌లువ‌నున్న ఎంపీలు

 న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మంగళవారం కలవనున్నారు.  పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామా, అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్తారు. అన్ని అంశాలపై వినతిపత్రం సమర్పించనున్నారు.
Back to Top