రక్షణమంత్రిని కలిసిన ఎంపీలు

న్యూ ఢిల్లీ: వైయస్సార్సీపీ ఎంపీలు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ ను కలిశారు. ఏఎన్-32 విమాన ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యుల ఆందోళనను పరికర్ కు వివరించినట్టు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు తెలిపారు. గత నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్‌ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం  గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించిన సంగతి విధితమే. ఇటీవలే వైయస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారు పడుతున్న ఆవేదనను ఎంపీల ద్వారా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Back to Top